Nuzvid: సరస్వతీ దేవి అలంకారంలో కోట మహిషాసుర మద్దిని అమ్మవారు!

Nuzvid: నూజివీడులో 70వ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు, ఆలయంలో విద్యార్థుల అక్షరాభ్యాసాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Oct 2026 8:54 AM IST
Nuzvid
X

Nuzvid: సరస్వతీ దేవి అలంకారంలో కోట మహిషాసుర మద్దిని అమ్మవారు!

Nuzvid: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో 70వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా పట్టణ నడిబొడ్డులో వేంచేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మద్దిని అమ్మవారు నేడు ఏడవ రోజు శ్రీ సరస్వతీ దేవి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.నేడు తెల్లవారుజాము నుండి భారీగా విద్యార్థినీ,విద్యార్థులు,భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

నేడు మూలా నక్షత్రం సరస్వతి దేవి జన్మ నక్షత్రం కావడంతో గుళ్లో అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు.ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ మాట్లాడుతూ అమ్మవారి యొక్క విశిష్టత వివరిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్