Eluru: కీర్తిసాయి చిట్స్ ఆస్తుల నివేదిక పంపండి: కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: ఏలూరు శ్రీ కీర్తిసాయి చిట్స్ కేసులో జప్తు చేసిన రూ.1.06 కోట్ల విలువైన ఆస్తుల వేలం, డిపాజిటర్లకు పరిహారంపై కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు.
Eluru: కీర్తిసాయి చిట్స్ ఆస్తుల నివేదిక పంపండి: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు: ఏలూరులోని శ్రీ కీర్తిసాయి చిట్స్ సంస్థ పై సిఐడి కేసుకు సంబంధించి సంబంధిత సంస్థ స్థిర,చరాస్తులపై నివేదికను రాష్ట్ర కమిటీ కి నివేదించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.శ్రీ కీర్తిసాయి చిట్స్ సంస్థ కి సంబంధించి స్థిర, చరాస్తుల విలువను అంచనా వేసేందుకు ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన కలెక్టరేట్ లో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ శ్రీ కీర్తిసాయి చిట్స్ సంస్థ పై ఏలూరులో 2014లో ఆర్థిక సంస్థల డిపాజిటర్ల రక్షణ చట్టం కేసు నమోదైందని,అనంతర ఈ కేసును సిఐడి కి బదిలీ చేసారన్నారు.అనంతరం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శ్రీ కీర్తి సాయి చిట్స్(Sri Keerthi Sai Chits) సంస్థకు సంబంధించిన చరాస్తులు మరియు స్థిరాస్తులను గుర్తించి, జప్తు చేయడం జరిగిందన్నారు.
శ్రీ కీర్తిసాయి చిట్స్ సంస్థ కు సంబంధించి పనిచేయని స్థాయిలో ఉన్న 3 వాహనాలు,363.768 గ్రాముల బంగారు నగలు, 5 భూములు,స్థలాలు గుర్తించడం జరిగిందన్నారు.వీటిలో బంగారు నగల మినహా మిగిలిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.1,06,45,000 రూపాయలుగా అంచనా వేయడం జరిగిందని,వీటి వివరాలపై నివేదికను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపుతూ సదరు ఆస్తులను వేలం వేసేందుకు,వేలం అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని డిపాజిటర్లకు న్యాయబద్ధంగా పంపిణీ చేయడానికి జప్తు చేసిన ఆస్తులను వేలం వేయడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరుతున్నామన్నారు.
ఈ సమావేశానికి రాజమహేంద్రవరంలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయం సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ అస్మా పర్వీన్ జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ,ఏలూరు ఆర్డిఓ కె.లక్ష్మీప్రసన్న,జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు,రవాణా అధికారి ఎస్.బి.శేఖర్,రాజమహేంద్రవరంలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయం సర్కిల్ ఇన్స్పెక్టర్ కృపానందం,సమాచార ఇంజనీర్ యు. సురేంద్రనాథ్, ఎల్డిఎమ్ కె.సత్యనారాయణ, ఏలూరు నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ డి.శ్రీనివాసరావు, ఏలూరు అర్బన్ తహసీల్దార్ ఎస్.వి.రవీంద్రనాథ్,రురల్ తహసీల్దార్,విజయకుమార్ రాజు,యూనియన్ బ్యాంకు సిబ్బంది జి.సత్యనారాయణ,ప్రభృతులు పాల్గొన్నారు.




