Velerupadu: పోలవరం నిర్వాసితులకు ఇంటి పరిహారం అందేలా చర్యలు!
Velerupadu: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు డిసెంబర్ లోపు ఇంటి పరిహారం అందించి తరలించే ప్రక్రియను ముమ్మరం చేసినట్లు తెలిపిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.వి. శర్మ.
Velerupadu: పోలవరం నిర్వాసితులకు ఇంటి పరిహారం అందేలా చర్యలు!
Velerupadu: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇంటి పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట, రేపాకగొమ్ము, వేలేరుపాడు గ్రామాల్లో బుధవారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.వి. శర్మ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితులను డిసెంబర్ నాటికి తరలించే ప్రక్రియలో భాగంగా అర్హత ఉన్న ప్రతి నిర్వాసితుడికి ఇంటి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరికైనా పరిహారానికి సంబంధించి సమస్యలు ఉంటే గ్రామసభల్లోనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అవార్డులో పేరు ఉండి సంబంధిత వ్యక్తి మరణించి ఉంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో లేని నిర్వాసితులకు సంబంధించిన పత్రాలను వారి తరఫున సంబంధిత రెవెన్యూ అధికారులకు అందజేయాలని కోరారు.
అదేవిధంగా భూములకు పరిహారం అందని నిర్వాసితుల నుంచి కూడా అర్జీలు స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతి నిర్వాసితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ గ్రామసభల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సిబ్బంది సిహెచ్. తులసి (సీనియర్ అసిస్టెంట్), జి. జ్యోతి (జేఈ), శ్రీమతి వి. యామిని (సీఓ), ఏ. పద్మజ (సీనియర్ అసిస్టెంట్), రెవెన్యూ సిబ్బంది పెంటరావు తదితరులు పాల్గొన్నారు.




