Eluru: ఏలూరు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల బందోబస్తుపై ఎస్పీ ఆకస్మిక తనిఖీలు!
Eluru: ఏలూరు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ భీమడోలు, కైకలూరు సహా పలు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు, బందోబస్తు ఏర్పాట్లను తనిఖీ చేశారు.
Eluru: ఏలూరు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల బందోబస్తుపై ఎస్పీ ఆకస్మిక తనిఖీలు!
Eluru: ఈ నెల 29-11-2026న ఏలూరు జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ భద్రతా ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఎన్నికలు జరగనున్న భీమడోలు,ద్వారకా తిరుమల, ఉంగుటూరు, నిడమర్రు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, గణపవరం మండలాల్లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు మరియు సమస్యాత్మక ప్రాంతాల్లో చేపట్టిన బందోబస్తును ఆయన స్వయంగా సమీక్షించారు.
ఓటర్లు ఎలాంటి భయం,ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా పటిష్ట భద్రత కల్పించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. రూట్ మొబైల్ పార్టీలు,పెట్రోలింగ్ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నిఘా పెట్టాలని,నియమావళి ఉల్లంఘన జరిగితే వెంటనే స్పందించాలని సూచించారు.
సిబ్బంది అంతా క్రమశిక్షణతో, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీల్లో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్, ఇన్స్పెక్టర్లు రజని కుమార్, వి.రవికుమార్, కృష్ణ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




