Eluru: ఎన్నికల భద్రతపై ప్రొబేషనరీ అధికారులకు ఏలూరు ఎస్పీ అవగాహన!
Eluru: రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రొబేషనరీ ఐపీఎస్, డీఎస్పీ అధికారులకు ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ భద్రతా ఏర్పాట్లు, పోల్ కామ్ యాప్, డ్రోన్ నిఘాపై అవగాహన కల్పించారు.
Eluru: ఎన్నికల భద్రతపై ప్రొబేషనరీ అధికారులకు ఏలూరు ఎస్పీ అవగాహన!
Eluru: నవంబర్ 29, 2026న జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రొబేషనరీ ఐపీఎస్ మరియు డీఎస్పీ అధికారులకు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఎన్నికల భద్రతా ఏర్పాట్లు,బందోబస్తు నిర్వహణపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో 78వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్లు షా మహ్మద్ ఇమ్రాన్ మహ్మద్ ఇర్ఫాన్,చల్లే పవన్ కళ్యాణ్‌లతో పాటు 8 మంది ప్రొబేషనరీ డీఎస్పీలు హెరుకురి రిజ్వానా,బన్నోత్ ప్రియాంక,మధారపు ప్రత్యూష,చింతగింగాల సాయి రాఘవ, కోల పృథ్వీరాజ్,ముడవత్ రవీంద్ర నాయక్,వై.ఎన్. రాకేష్ రెడ్డి,పి.శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత, బ్యాలెట్ బాక్సుల సురక్షిత రవాణా,కౌంటింగ్ కేంద్రాల బందోబస్తు మరియు విజయోత్సవ ఊరేగింపుల నియంత్రణపై ఎస్పీ గారు దిశానిర్దేశం చేశారు.అలాగే,జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 'పోల్ కామ్' యాప్, డ్రోన్ల సాయంతో పోలింగ్ సరళిని నిజ సమయంలో పర్యవేక్షిస్తూ అవాంఛనీయ సంఘటనలపై తక్షణమే స్పందించే విధానాలను అధికారులు పరిశీలించారు.
ప్రతి అధికారి నిష్పక్షపాతంగా,సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా కృషి చేసి ఎన్నికలను విజయవంతం చేయాలని ఎస్పీ సూచించారు.




