Eluru: సాగునీటి వనరులకు పడిన గండ్లకు తక్షణ మరమ్మతులు: కలెక్టర్
Eluru: అర్నాబ్, మురసు తుఫాన్ల వల్ల కాల్వలు, చెరువులకు పడిన గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖను ఆదేశించారు.
Eluru: సాగునీటి వనరులకు పడిన గండ్లకు తక్షణ మరమ్మతులు: కలెక్టర్
ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లాలో ఇటీవల అర్నాబ్,మురసు తుఫాన్లు,భారీ వర్షాల కారణంగా నదులు,కాల్వలు,చెరువులు, రిజర్వాయర్లకు ఏర్పడిన గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ రానున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని కాల్వలు, చెరువుల గట్లను పటిష్ఠం చేయాలని సూచించారు.
జలధార–జలహారతి కార్యక్రమం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయడంతో భూగర్భ జలమట్టం 2.83 మీటర్లు పెరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఇంచార్జి డీఆర్వో ఎం.ముక్కంటి, ఇరిగేషన్ అధికారులు, భూగర్భ జల శాఖాధికారి కోదండరాం తదితరులు పాల్గొన్నారు.




