Rampachodavaram: సిరిగిందలపాడులో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

Rampachodavaram: రంపచోడవరం సిరిగిందలపాడులో ఘనంగా రామకృష్ణ మిషన్ వైద్య శిబిరం. 550 మందికి పైగా గిరిజనులకు వైద్య సేవలు, ఉచిత కంటి పరీక్షలు.

Prasanna, Rampachodavaram
Published on: 20 Sept 2026 6:20 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: సిరిగిందలపాడులో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

రంపచోడవరం: పోలవరం జిల్లా, రంపచోడవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమండ్రి వారి అధ్వర్యంలో లో స్థానిక, సిరిగిందలపాడు లో రామకృష్ణ మిషన్ వద్ద 20.09.2026 ఆదివారం ప్రత్యేక వైద్య శిభిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహారాజ్ తెలియచేసినారు.

ఈ వైద్య శిబిరంలో రాజమండ్రి రామకృష్ణ మిషన్ సెక్రటరీ స్వామి పరిజ్ఞేయా నంద జీ మహారాజ్ పాల్గొన్ని మెడికల్ క్యాంప్ నీ పరిశీలించారు. స్వామిజీ మాట్లాడుతూ . వివేకానంద బోధించిన మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడం అనే విషయాన్ని స్పూర్తిగా తీసుకుని మనం అందరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని , నిస్వార్ధంగా సేవ చేస్తే వారికి మనశ్శాంతి , ప్రశాంతత కలుగుతోందుని స్వామిజీ స్పష్టం చేశారు.

కష్టకాలామ్ లో కాకుండా అనుదినం భగవంతుడ నామస్మరణ అలవాటుగా చేసుకోవాలని స్వామిజీ తెలియచేసినారు.ఈ వైద్య శిబిరంలో డా "గోలి వెంకట రామారావు గారు, డాక్టర్ వల్లేపల్లి రామకృష్ణ గారు, , డా శ్రీకృష్ణ పాతూరి గారు, డా " రాయుడు శ్రీనివాస్, డాక్టర్ అమలదసు రాజా మరియు ,జీ.ఎస్.ఎల్ జనరల్ ఆసుపత్రి రాజానగరం వివిధ విభాగాల్లో 5 గురు వైద్య నిపుణులు పాల్గొని సుమారు 550 మందికి వైద్యసేవలు అందించారు. అవసరం అయిన వారికి 109 మందికి రక్త నీరుడు పరీక్షలు, 9 మందికి ఇ. సి. జి. లు,15 మందికి కి థైరాయిడ్ పరీక్షలు, 11 మందికి ఎక్స్ రే, లు , 16 మందికి

, ఫిజియథెరపీ లు చేసినట్లు స్వామీజి తెలియచేసినరు . మరియు పరమహంస యోగానంద నేత్రాలయం వేమగిరి,వారిచే కంటి పరీక్షలు నిర్వహించి సుమారు 140 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 40 మందికి కళ్ళజోళ్ళు,మరియు 17 మందిని కంటి ఆపరేషన్ లు నిమిత్తం వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం కి తరలించారు.

ఈ వైద్య శిబిరంలో పరమహంస యోగానంద నేత్రాలయ ప్రోగ్రామ్ మేనేజర్ నక్కా చంటి బాబు వాలంటీర్లు గిరిరాజ్ కృష్ణ , సత్య ప్రసాద్, (Xerox) రాము , మంగిరెడ్డి, భగీ రధ రాజు, అశోక్ , చంద్రరావు, మరియు సంజీవ్ కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కాకినాడ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోర్స్ (క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ ) విద్యార్థినులు రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. రోగులు సహాయకులకు అన్నదానం నిర్వహించి నట్లు స్వామిజీ తెలియచేసినారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram