Rampachodavaram: సిరిగిందలపాడులో 160 మందికి ఉచిత వైద్య పరీక్షలు!
Rampachodavaram: రంపచోడవరం సిరిగిందలపాడులో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 160 మంది గిరిజనులకు వైద్య సేవలు, ఉచిత పరీక్షలు అందజేసినట్లు స్వామీజీ తెలిపారు.
Rampachodavaram: సిరిగిందలపాడులో 160 మందికి ఉచిత వైద్య పరీక్షలు!
రంపచోడవరం: పోలవరం జిల్లా, రంపచోడవరం, రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమండ్రీ వారి అధ్వర్యంలో లో స్థానిక, సిరిగిందలపాడు లో రామకృష్ణ మిషన్ వద్ద ఆదివారం వైద్య శిభిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తెలియచేసినారు.
ఈ వైద్య శిబిరంలో డాక్టర్ దాసరి ఉమా మహేష్ గారు, డాక్టర్ శ్రీనివాస్ రాయుడు డాక్టర్ వెలమ స్నేహా మాధురి పాల్గొని సుమారు 160 మందికి వైద్యసేవలు అందించారు. అవసరం అయిన వారికి 57 మందికి రక్త నీరుడు పరీక్షలు 3 ఇ. సి. జి. లు 13 మందికి X రే లు ,11 మందికి థైరాయిడ్ పరీక్షలు, 20 మందికి, ఫిజియథెరపీ లు చేసినట్లు స్వామీజి తెలియచేసినారు.
ఈ వైద్య శిబిరం లో రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్ మరియు సిబ్బంది వాలంటీర్ గిరిరాజ్ కృష్ణ పాల్గొన్నారు. రోగులు సహాయకులకు అన్నదానం నిర్వహించి నట్లు స్వామిజీ తెలియచేసినారు.




