Eluru: ఏలూరు జిల్లాలో పీడబ్ల్యూసీ బృందం పర్యటన: పంటల పరిశీలన
Eluru: వికసిత్ భారత్‌లో భాగంగా జీఎస్‌డీపీ పెంపునకు ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో పీడబ్ల్యూసీ బృందం ఉద్యాన పంటలు, ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించింది.
Eluru: ఏలూరు జిల్లాలో పీడబ్ల్యూసీ బృందం పర్యటన: పంటల పరిశీలన
ఏలూరు జిల్లా: వికసిత్ భారత్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమరావతి,తిరుపతి,విశాఖపట్నం అనే 3 జోన్లుగా ప్రభుత్వం విభజించింది.ఇందులో భాగంగా రాష్ట్రీయ స్థూల ఉత్పత్తి (GSDP)ని వృద్ధి చేయడానికి, ప్రాథమిక రంగంలో (Primary Sector) తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీడబ్ల్యూసీ (PWC) ప్రతినిధుల బృందం గురువారం పెదవేగి మండలంలో విస్తృతంగా పర్యటించింది.
ఈ బృందం మండలంలోని పలు ఉద్యాన పంట క్షేత్రాలను పరిశీలించి,స్థానిక రైతులతో ముఖాముఖి చర్చలు జరిపింది.పర్యటనలో భాగంగా ఉప్పలపాటి చక్రపాణి పొలంలో సాగవుతున్న కొబ్బరి,వక్క, మిరియం,పసుపు,దాల్చిన చెక్క అంతర పంటల విధానాన్ని పరిశీలించారు.
ఆయిల్ రైతు ఎం.ఎల్.వి.ప్రసాద్ తోటలోని ఆయిల్‌పామ్ మరియు కోకో మిశ్రమ సాగును సందర్శించారు.ప్రాసెసింగ్ యూనిట్లు:ఉండవల్లి వెంకటరావు పొలంలోని కోకో ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు,ఏపీ ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో రైతుల నుంచి సేకరించిన సలహాలు,సూచనలను సమగ్ర నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు PWC ప్రతినిధులు తెలిపారు.
ఈ పర్యటనలో PWC బృందం సభ్యులు బినయ్ సొరెన్గ్, స్వస్తిక్ త్యాగి,జిల్లా ఉద్యాన అధికారి కె.సాజానాయక్,సహాయ సంచాలకులు కె.సంతోష్,ఆయిల్ ఫెడ్ డెవలప్మెంట్ అధికారి కె. జగదీశ్వరరెడ్డి,మండల ఉద్యాన అధికారి ఎం.రత్నమాల,గ్రామ ఉద్యాన సహాయకులు మరియు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.




