Eluru: పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన పీపీఏ బృందం!
Eluru: ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా నేతృత్వంలోని బృందం పరిశీలించింది. పనుల పురోగతిపై సంతృప్తి.
Eluru: పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన పీపీఏ బృందం!
Eluru: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా నేతృత్వంలోని బృందం బుధవారం పరిశీలించింది. ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్–1,2లో జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి,పనుల వేగంపై సంతృప్తి వ్యక్తం చేసింది.
నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా వేగం పెంచాలని, అధికారుల–నిర్మాణ సంస్థ సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. అనంతరం సీఎస్‌ఎంఆర్‌ఎస్ నిపుణుల బృందం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి మట్టి,రాయి నాణ్యత,తేమ శాతాన్ని పరీక్షించింది. అధికారులు,ఎంఈఐఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.




