Eluru: పోలవరంలో ప్రజల దాహార్తి తీరుస్తున్న వార్డు అభ్యర్థిని మున్ని!

Eluru: ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీ ఎన్నికల వేళ బీసీ కాలనీ వార్డు అభ్యర్థిని మున్ని, కుమారుడు షాజు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు అందిస్తున్నారు.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 23 Nov 2026 10:34 AM IST
Eluru
X

Eluru: పోలవరంలో ప్రజల దాహార్తి తీరుస్తున్న వార్డు అభ్యర్థిని మున్ని!

Eluru: ఏలూరు జిల్లా పోలవరం లో స్థానిక పంచాయతీ ఎన్నికల సెగ మొదలైంది అభ్యర్థులు వారి వారికి కేటాయించిన గుర్తులతో ప్రచారం ముమ్మురంగా సాగిస్తుంటే బీసీ కాలనీకి చెందిన మున్ని మాత్రం ప్రజలు మంచినీటి కోసం పడుతున్న ఇబ్బంది ఆమె దృష్టికి రావడంతో ఆమె 11 మరియు తనయుడు షాజు 10 వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న, వార్డుల లో తక్షణం వాటర్ ట్యాంకులను రప్పించి ప్రజలకు మంచినీటి కష్టాలను తీరుస్తున్నారు.

అయితే సుమారు వారం రోజుల నుండి తుఫాన్ కారణంగా కవ్వాడ కాలువ వరద రావడంతో సత్య సాయి పైపులైన్లు దెబ్బతిన్నాయి వీటిని పునరుద్దించడానికి సమయం పడుతుండడంతో ఆ విషయం తెలుసుకున్న మున్ని ప్రజల దాహార్తి తీర్చడానికి మంచినీటి ట్యాంకుల ద్వారా తన వార్డు ప్రజలకు మంచి మానవతా దృక్పథంతో త్రాగునీరు అందిస్తున్నారు.

ఈ సేవా కార్యక్రమాని కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఏ పదవి లేకుండానే ప్రజలకు కష్ట కాలంలో ఇలా సేవ చేస్తుంటే ఈమె కు వారి కుమారుడికి పదవిలో ఉంటే మరింత సేవలు చేస్తారు.

అనే నమ్మకం మాకు కలిగింది అంటున్న ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యురాలుగా పోటీ చేస్తున్న మున్నీ నే ఎన్నుకుంటామంటూ ముక్త కంఠంతో ప్రజలు చెబుతున్నారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM