Polavaram: పోలవరం ఉద్యోగులకు 140 కి.మీ దూరంలో ఎలక్షన్ డ్యూటీలు
Polavaram: ఏలూరు జిల్లా పోలవరం ఉద్యోగులకు 140 కి.మీ దూరంలోని కుక్కునూరు, వేలేరుపాడులో ఎన్నికల డ్యూటీలు; కమాటీలు, అటెండర్లకు పీవో ఆర్డర్లపై విమర్శలు.
Polavaram: పోలవరం ఉద్యోగులకు 140 కి.మీ దూరంలో ఎలక్షన్ డ్యూటీలు
పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం మండలం లో పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల విధులు నిర్వహించడానికి సుమారు 200 మంది పైనే ఉద్యోగులను పోలవరం పక్క మండలాల్లో కాకుండా ఆడవారు ముసలివారని కూడా తేడా లేకుండా అందర్నీ సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుక్కునూరు వేలేరుపాడు మండలాలకు ఎలక్షన్ డ్యూటీలు వేయడంపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆర్డర్లలో కమాటీలు అటెండర్లు అంగన్వాడీ టీచర్లు, వీఆర్ఏలు అందరికీ పిఓ ( పోలింగ్ ఆఫీసర్) కింద ఆర్డర్లను ఇవ్వడం జరిగింది ఎలక్షన్ మీద పరిజ్ఞానం లేని వీరు అధికారులు తీసుకున్న నిర్ణయానికి ఏం చేయాలో పాలు పోవడం లేక తలలు పట్టుకుంటున్నారు పక్క పక్క మండలాలకు ఎన్నికలు విధులు కేటాయించవలసిన అధికారులు ఇలా దూర ప్రాంతాలకు కేటాయించడం లో మహిళ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కుక్కునూరు వేలూరుపాడు వెళ్లి విధులు నిర్వహించాలి అంటే సరేనా బస్సు సౌకర్యాలే సరిగ్గా లేవు పక్క పక్క మండలాలు అయితే ఇబ్బంది ఉండదు కానీ ఇలా దూర ప్రాంతాలు అయితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఇలా ఎలక్షన్ డ్యూటీలు వేసేటప్పుడు కలెక్టర్ పర్యవేక్షణ తో సంబంధం లేకుండా ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెట్టే యువచనా మానుకోవాలని యూనియన్లు సూచిస్తున్నాయి.




