Kukunoor: అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు పరామర్శ

Kukunoor: వేలేరుపాడు మండలం ఎర్రబోరులో పదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు భరోసా: వీడియో కాల్ పరామర్శ, ఫోన్‌పే ద్వారా ఆర్థిక సాయం.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 27 Sept 2026 7:09 PM IST
Kukunoor
X

Kukunoor: అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు పరామర్శ

Kukunoor: వేలేరుపాడు మండల పరిధిలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన గట్టు రాంబాబు తండ్రి సామేలు అనే యువకుడు గత పదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మేచినేని సంజయ్ ఈ విషయాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు దృష్టికి తీసుకెళ్లారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు రాంబాబుకు ఫోన్‌ ద్వారా వీడియో కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫోన్‌పే ద్వారా కొంత నగదును ఆర్థిక సహాయంగా అందించారు. అలాగే వేలేరుపాడు మండల పర్యటనకు వచ్చిన సమయంలో రాంబాబును స్వయంగా కలిసి పరామర్శిస్తానని హామీ ఇచ్చారు.

అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న యువకుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మేచినేని సంజయ్, జనసేన నాయకులు శివరాం, చంటి, కిరణ్, టీడీపీ నాయకులు నంబూరి మంగయ్య, జేమ్స్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR