Chinturu: జలపాతాలు, వాగుల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ!
Chinturu: చింతూరు ఏజెన్సీలో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి: జలపాతాలు, వాగుల వద్ద నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని పోలవరం జిల్లా ఎస్పీ కె.చక్రవర్తి హెచ్చరిక.
Chinturu: జలపాతాలు, వాగుల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ!
చింతూరు: పోలవరంజిల్లా లోని పర్యాటక ప్రాంతాలలో పర్యటించే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి అని జిల్లా ఎస్పీ కె చక్రవర్తి సూచించారు. చింతూరు ఏజెన్సీలో ఎస్పీ చక్రవర్తి ఆదివారం పర్యటించారు. చింతూరు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ మాట్లాడారు.
పోలవరం జిల్లాలో ప్రకృతి అందాలు చూడటానికి రమణీయంగా అద్భుతంగా ఉండడంతో ఈ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులతో నిండిపోతుంది అన్నారు. ప్రధానంగా ఏజెన్సీలోని జలపాతాలు వాగుల వద్ద ప్రకృతి అందాలను వీక్షించే సమయంలో పర్యాటకులు కాస్త ఆదమరిస్తే ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుందని అన్నారు.
పర్యాటక ప్రాంతాల సందర్శన సమయంలో అప్రమత్తంగా ఉండాలి అని సూచిక బోర్డులు పెట్టినప్పటికీ పర్యాటకులు వాటిని పట్టించుకోకుండా అజాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారని అన్నారు. పర్యాటకులు పర్యాటక కేంద్రాలలో అధికారులు సూచించే నియమాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు.
పర్యాటక ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండి ప్రకృతి అందాలను ఆస్వాదించి సురక్షితంగా ఇంటికి వెళ్లాలని జిల్లా ఎస్పీ చక్రవర్తి కోరారు. బైక్స్ రైడర్స్ వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించాలని సూచించారు. జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ఎస్పీ చక్రవర్తి హెచ్చరించారు.
మాదకద్రవ్యాలకు అలవాటు పడి యువత జీవితాలను జైలు పాలు చేసుకోవద్దని హితవు పలికారు.ఆసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ చక్రవర్తి హెచ్చరించారు.




