Chintoor: పోతనపల్లి సమీపంలో ఎదురెదురుగా బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలం పోతనపల్లి-వాలుమూరిగొంది మధ్య రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
Chintoor: పోతనపల్లి సమీపంలో ఎదురెదురుగా బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి!
చింతూరు: చింతూరు మండలం పోతనపల్లి - వాలుమూరిగొంది గ్రామాల మధ్య రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టుకున్నాయి.ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.వివరాల్లోకి వెళితే ఎర్రంపేట లోని అరకు కాఫీ సెంటర్ కి చెందిన పల్లాల రమణ రెడ్డి (40) సుకుమామిడి గ్రామం నుండి చింతూరు వైపు బైక్ పై వస్తున్నాడు. చూటూరు గ్రామానికి చెందిన పాయం అశోక్(26) చింతూరు నుంచి సుకుమామిడి వైపు బైక్ పై వెళుతున్నాడు.
ఈ క్రమంలో పోతనపల్లి - వాలుమూరిగొంది గ్రామాల మధ్య ఈ రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రమణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ అశోక్ ను చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
ప్రమాదం విషయం తెలుసుకున్న చింతూరు ఎస్సై సంతోష్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.ఎస్సై సంతోష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




