Eluru: అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణంలో పంటల బీమా రైతులకు ఆర్థిక భరోసా!

Eluru: ఏలూరు జిల్లాలో రైతులు, కౌలు రైతులు పంటల బీమా పథకాల్లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 28 Nov 2026 1:50 PM IST
Eluru
X

Eluru: అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణంలో పంటల బీమా రైతులకు ఆర్థిక భరోసా!

Eluru: ఏలూరు జిల్లాలోని అర్హులైన రైతులు,కౌలు రైతులందరూ పంటల బీమా పథకాల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. కలెక్టరేట్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరియు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు.ఈ పథకం కింద పంటల వారీగా ప్రీమియం,బీమా వివరాలు వరి పంట ఎకరాకు 500 రూపాయల ప్రీమియంతో,41 వేల రూపాయల బీమా వర్తిస్తుంది,మొక్కజొన్నకు పంటకు ఎకరాకు483 రూపాయల ప్రీమియంతో, 42 వేల రూపాయల బీమా లభిస్తుంది,పెసర,మినుము పంటలకు ఎకరాకు 60 రూపాయల ప్రీమియంతో,20 వేల రూపాయల బీమా అందుతుంది,మామిడి,జీడిమామిడి పంటలకు ఎకరాకు వాతావరణ ఆధారిత బీమా కింద ఎకరాకు 2,250 రూపాయల ప్రీమియం చెల్లిస్తే,45 వేల రూపాయల వరకు పరిహారం లభిస్తుంది,అకాల వర్షాలు,తెగుళ్లు,ప్రతికూల వాతావరణం వల్ల పంట నష్టపోతే ఈ బీమా ఆదుకుంటుందని కలెక్టర్ తెలిపారు.

ఆసక్తి గల రైతులు డిసెంబర్ 15వ తేదీ లోపు పెసర,మినుము పంటలకు;డిసెంబర్ 31వ తేదీ లోపు వరి, మొక్కజొన్న,మామిడి పంటలకు ప్రీమియం చెల్లించాలి.ఆధార్,బ్యాంక్ పాస్ బుక్,భూమి పత్రాలతో కామన్ సర్వీస్ సెంటర్లు లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid