Kunavaram: కూనవరంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

Kunavaram: కూనవరం మండలం భీమవరంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి, చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 17 Sept 2026 6:15 PM IST
Kunavaram
X

Kunavaram: కూనవరంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

కూనవరం: కూనవరం మండలం భీమవరం గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు మండల అధ్యక్షులు కరక పవన్ కుమార్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పవన్ కుమార్ మాట్లాడుతూ దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ 25 సంవత్సరాలు ప్రజాసేవను పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దీర్ఘాయుష్షు ఆయు ఆరోగ్యాలు కలగాలని భగవంతున్ని ప్రార్థించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ప్రజాసేవలో 25 ఏళ్ల పరిపాలన చారిత్రాత్మక ప్రస్థానానికి గుర్తుగా దేశవ్యాప్తంగా నెల రోజులపాటు సేవా సంకల్ప అభియాన్ పేరుతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నోముల రామారావు, పాయం వెంకయ్య హాజరై గ్రామాలలో పార్టీ అభివృద్ధికి మన ఊరు మన జెండా కార్యక్రమం లో భాగంగా బిజెపి పతాక ఆవిష్కరణ జెండా ఎగరవేశారు. కార్యకర్తలకు గ్రామాలలో పార్టీ అభివృద్ధి ఉద్దేశించి సంక్షేమ పథకాల గురించి గ్రామాలలో తెలియపరచాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నోముల సత్యనారాయణ, సోయం సుధారాణి, పాయం వెంకన్నబాబు, చూడబోయిన వెంకన్న, పూణెం సురేష్, కొవ్వల రాజా, బీవీఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR