Eluru: చిన్నారులతో భిక్షాటన చేయిస్తే కేసులు నమోదు.. అధికారి హెచ్చరిక!
Eluru: చిన్నారులతో భిక్షాటన చేయిస్తే కేసులు నమోదు చేస్తామని ఏలూరు జిల్లా బాలల సంరక్షణాధికారి సీహెచ్. సూర్యచక్రవేణి హెచ్చరించారు.
Eluru: చిన్నారులతో భిక్షాటన చేయిస్తే కేసులు నమోదు.. అధికారి హెచ్చరిక!
Eluru: చిన్నారులతో భిక్షాటన చేయించే వారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా బాలల సంరక్షణాధికారి సీహెచ్.సూర్యచక్రవేణి హెచ్చరించారు.ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల దేవస్థానం సమీపంలో ముగ్గురు చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న మహిళను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చింతమనేనినవ్యశ్రీ,దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.
విచారణలో నల్లజర్లకు చెందిన మహిళ తన ముగ్గురు పిల్లలకు గాంధీ వేషధారణ చేయించి వారాంతాల్లో భిక్షాటన చేయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 ద్వారా పిల్లలకు,తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి,చిన్నారులను ప్రతిరోజూ పాఠశాలకు పంపించాలని సూచించారు.
మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించి, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.




