Eluru: స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి!

Eluru: ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి, ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎం.వి. శేషగిరిబాబు ఆదేశించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Oct 2026 6:17 AM IST
Eluru
X

Eluru: స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి!

Eluru: ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు,రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి మిరియాల వెంకట శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడలతో కలిసి ఏలూరు నగరపాలక సంస్థ,నూజివీడు,జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాల పోలింగ్ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా శేషగిరిబాబు మాట్లాడుతూ, ఎన్నికల సిబ్బంది ఎలాంటి పక్షపాతం,నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని,పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారాలు, సభలు జరగకుండా పటిష్ట నిఘా పెట్టాలని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్, నూజివీడు,జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.పోలింగ్ ప్రాంతాల్లో వెలుపలి వ్యక్తులు బస చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని,శనివారం నాటికి సిబ్బందిని,మెటీరియల్‌ను వాహనాల్లో తరలిస్తామని అన్నారు.

సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశామని,సిబ్బందికి పూర్తి శిక్షణ ఇచ్చామని వివరించారు.ఈ సమీక్షా సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి,ఇంచార్జ్ డిఆర్ఓ ఎం.ముక్కంటి, అదనపు ఎస్పీ ప్రసాదరావు, డిఎస్పీ శ్రావణ్ కుమార్,ఆర్టీఓ శేఖర్,డీఈఓ వెంకటలక్ష్మమ్మ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్