Eluru: నడిరోడ్డుపై ఆటో అడ్డం పెట్టి నిరసన.. ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత!
Eluru: ఏలూరు జిల్లా నూజివీడులో ఎన్నికల అధికారుల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట YSRCP అభ్యర్థి శీలం రామయ్యరావు ప్రచార ఆటోతో బైఠాయించి ఆందోళన.
Eluru: నడిరోడ్డుపై ఆటో అడ్డం పెట్టి నిరసన.. ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత!
Eluru: ఎన్నికల అధికారుల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ నూజివీడు మున్సిపల్ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.వైఎస్సార్సీపీ 19వ వార్డు అభ్యర్థి శీలం రామయ్యరావు మున్సిపల్ ఆఫీస్ ముందు తన ప్రచార ఆటోను అడ్డంగా పెట్టి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.వివరాల్లోకి వెళ్తే బస్టాండ్ సమీపంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రచార ఆటోకి కట్టిన బ్యానర్లను ఎన్నికల నిర్వహణ అధికారులు కనీసం ముందస్తు సమాచారం కానీ,నోటీసులు కానీ ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా చించివేశారని అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నడిరోడ్డుపై బహిరంగంగా బ్యానర్లు చించివేయడం వల్ల ప్రజల్లో తన ఇమేజ్ను డ్యామేజ్ చేసి,ఓటర్లను తప్పుదోవ పట్టించేలా అధికారులు వ్యవహరించారని ఆయన ఆరోపించారు.సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి (RO) స్వయంగా వచ్చి సమాధానం చెప్పేంతవరకు కదిలేది లేదంటూ ఆటోను అడ్డంగా పెట్టి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా శీలం రామయ్యరావు మాట్లాడుతూ"కేవలం వైఎస్సార్సీపీ ప్రచార ఆటో బ్యానర్లు మాత్రమే చించివేయడంలో అంతర్యం ఏమిటి? కనీసం సమాచారం ఇవ్వాల్సిన కనీస బాధ్యత అధికారులకు లేదా? స్థానిక మంత్రి గారికి సంబంధించిన ఆటోలు, తెలుగుదేశం పార్టీ ప్రచార రథాలు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతుంటే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం ఎంతవరకు సబబు? అధికార పార్టీకి ఒక న్యాయం,ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి ఒక న్యాయమా?" అంటూ తీవ్రంగా వాపోయారు.
మరోవైపు వైఎస్సార్సీపీ ప్రచార రథాలకు ఏర్పాటు చేసిన మైకులను కూడా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అధికారులు తీసుకెళ్లిపోయారని మరో మైకులు ఏర్పాటుచేసిన ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.ఆందోళన తీవ్రం కావడంతో అధికారులు ఫోన్ ద్వారా అభ్యర్థితో మాట్లాడేందుకు ప్రయత్నించారు.
అయితే అధికారుల తీరుపై శీలం రామయ్యరావు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ "మమ్మల్ని నలుగురిలో నవ్వులపాలు చేస్తున్నారు,మాకు తక్షణమే న్యాయం చేయాలి"అని డిమాండ్ చేశారు.రిటర్నింగ్ అధికారి వచ్చి స్పష్టమైన వివరణ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి.
బైట్: ఆవేదన వ్యక్తం చేస్తున్న వైసీపీ అభ్యర్థి శీలం రామయ్య రావు వాయిస్




