Nuzvid: మురుగు నీటిలో నివాసం.. పట్టించుకోని అధికారులు, నేతలు!

Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురంలో అధికారుల నిర్లక్ష్యంతో ఓ కుటుంబం గత 15 రోజులుగా మురుగు నీటిలోనే నివాసం ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Nov 2026 12:36 PM IST
Nuzvid
X

Nuzvid: మురుగు నీటిలో నివాసం.. పట్టించుకోని అధికారులు, నేతలు!

నూజివీడు: అధికారుల నిర్లక్ష్యంతో ఓ కుటుంబం మురుగు నీటిలోనే నివాసం ఉంటూ ఇబ్బందులు పడుతూ కాలం వెళ్లదీస్తున్న సంఘటన నూజివీడు మండలం అన్నవరం శివారు వెంకటాద్రిపురం గ్రామంలో నెలకొంది.ఇటీవల పడిన రెండు తుఫానుల కారణంగా వచ్చిన వరద నీటికి వెంకటాద్రిపురం గ్రామంలోని ఓ ఇల్లు మొత్తం నీట మునిగిపోయింది.

అంతేకాక డ్రైనేజీ మురుగునీరు సైతం ఆ ఇంటిలోకి చేరుతుండడంతో ఆ ఇంటి పరిసర ప్రాంతాల నుండి నీరు బయటకు వెళ్ళే డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయి గత 15 రోజులుగా ఆ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. అంతేకాకుండా రోడ్డు వెంబడి వెళ్లే వాళ్లకు కూడా దుర్వాసన వస్తూ దోమల వ్యాప్తి చెందుతున్నాయి.

ఆ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఆ నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి.ఈ ప్రదేశం గ్రామంలో ఎక్కడో మారుమూలన ఉందనుకుంటే పొరపాటే. నూజివీడు విస్సన్నపేట ప్రధాన రహదారి ఆనుకొని ఈ ప్రాంతం ఉంది.

తమ సమస్యను పరిష్కరించాలని పంచాయతీ అధికారులకు,గ్రామంలో నాయకులమని చెప్పుకునే ప్రముఖులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కారం జరగలేదని వారు వాపోతున్నారు.పంచాయతీ కార్యదర్శి ఎన్నికల కోడ్ అంటూ,డ్రైనేజీ తీయించడానికి ప్రోక్లైన్ దొరకలేదంటూ సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్