Nuzvid: సబ్ కలెక్టర్ వినూత్న సమీక్ష ఎన్నికలు పకడ్బందీగా జరగాలి!

Nuzvid: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సబ్ కలెక్టర్ వినూత్న సమీక్ష నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Oct 2026 10:33 PM IST
Nuzvid
X

Nuzvid: సబ్ కలెక్టర్ వినూత్న సమీక్ష ఎన్నికలు పకడ్బందీగా జరగాలి!

నూజివీడు: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎన్నికలను అత్యంత పకడిబందీగా,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నూజివీడు సబ్ డివిజన్లోని పోలీస్,ఎక్సైజ్,,రెవెన్యూ,పంచాయతీ రాజ్,వైద్య శాఖ,విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న మాట్లాడుతూ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నూజివీడు,జంగారెడ్డిగూడెం డీఎస్పీలు మరియు సబ్ డివిజన్లోని సిఐలు,ఎస్ఐలు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్