Eluru: నూజివీడులో మూలా నక్షత్ర వేడుకలు: కిక్కిరిసిన భక్తులు!
Eluru: నూజివీడు సరస్వతీ దేవి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేలాది చిన్నారులకు అక్షరాభ్యాసాలతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది.
Eluru: నూజివీడులో మూలా నక్షత్ర వేడుకలు: కిక్కిరిసిన భక్తులు!
Eluru: దక్షిణాదిలో రెండో బాసరగా పేరుగాంచిన నూజివీడు పట్టణంలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.నేడు సరస్వతీ దేవి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో తెల్లవారుజామున 3:30 గంటల నుంచే అమ్మవారికి అభిషేకాలు,ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
తెల్లవారుజాము నుంచే భక్తులు,విద్యార్థినీ,విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో వేలమంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు.అమ్మవారి నామస్మరణలు, భక్తుల కోలాహలం,చిన్నారుల సందడితో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మార్మోగుతోంది.
తమ పిల్లలకు అమ్మవారి ఆశీస్సులు లభించాలని తల్లిదండ్రులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.భక్తుల రాకతో నూజివీడులోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక వైభవంతో కళకళలాడుతోంది.




