Nuzvid: నూజివీడులో స్కీం వర్కర్ల కదం తొక్కుడు డిమాండ్ల సాధనకు ధర్నా, ర్యాలీ

Nuzvid: నూజివీడులో కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ అంగన్వాడీ, ఆశా వర్కర్లు ధర్నా, ర్యాలీ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Oct 2026 7:57 PM IST
Nuzvid
X

Nuzvid: నూజివీడులో స్కీం వర్కర్ల కదం తొక్కుడు డిమాండ్ల సాధనకు ధర్నా, ర్యాలీ

నూజివీడు: నూజివీడులో స్కీం వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం కదం తొక్కారు.సీఐటీయూ,ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్,ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ,ఆశా వర్కర్లు ధర్నా,ర్యాలీ నిర్వహించారు.స్కీం వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

సంక్షేమ పథకాలను అందరికీ వర్తింపజేయాలని,ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.అనంతరం భారీ ర్యాలీగా నూజివీడులోని మంత్రి కొలుసు పార్థసారథి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే మంత్రి అందుబాటులో లేకపోవడంతో తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయన పీఏ గణేష్‌కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజు,ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు పి.కమల,అంగన్వాడీ టీచర్ల ప్రాజెక్ట్ కార్యదర్శి పి.రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.భారీ సంఖ్యలో అంగన్వాడీ, ఆశా వర్కర్లు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్