Nuzvid: నూజివీడులో 36 వార్డులూ కూటమివే: మంత్రి పార్థసారథి

Nuzvid: రాబోయే నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డుల్లోనూ కూటమి విజయం సాధిస్తుందని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Oct 2026 2:14 PM IST
Nuzvid
X

Nuzvid: నూజివీడులో 36 వార్డులూ కూటమివే: మంత్రి పార్థసారథి

Nuzvid: నూజివీడు పట్టణంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వార్డుల వారీగా పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.నేడు పట్టణంలోని ఎనిమిదో వార్డులో గడపగడపకు కూటమి నాయకులతో కలిసి మంత్రి పర్యటించారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రోడ్లు,డ్రైనేజీలు,విద్యుత్,స్టేడియం,పార్కుల అభివృద్ధి వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డులకు 36 వార్డుల్లోనూ విజయం సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు.ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.

నూజివీడు అభివృద్ధికి సుమారు రూ.70 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని,మరో రూ.150 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు.

సెంట్రల్ స్కూల్,ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుతో పాటు ఐదు పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.బలహీన వర్గాల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని,విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రాజెక్టు రూపొందించాలని అధికారులను కోరినట్లు మంత్రి పార్థసారథి వివరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్