Nuzvid: కూటమి అభ్యర్థులను గెలిపించండి మంత్రి కొలుసు పార్థసారథి
Nuzvid: నూజివీడులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కొలుసు పార్థసారథి. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.
Nuzvid: కూటమి అభ్యర్థులను గెలిపించండి మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడు: నూజివీడు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులను ప్రజలంతా ఆశీర్వదించాలని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు.మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో బుధవారం సాయంత్రం కూటమి చైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజా (రాజా)మరియు కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి మంత్రి డోర్-టు-డోర్ ప్రచారం నిర్వహించారు.
ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుని,కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో అందించిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను వివరించారు.వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని,కూటమి ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్ల పాలనలోనే చేసి చూపించిందన్నారు.
మాటల్లో చెప్పిందే చేతల్లో చేసి చూపించడం తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.నూజివీడు పట్టణం మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ముఖ్య నాయకులు,కార్యకర్తలు,మహిళలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




