Eluru: సొంత డబ్బుతో 200 విద్యుత్తు స్తంభాలు!
Eluru: నూజివీడులో రెండు దశాబ్దాలుగా విద్యుత్ స్తంభాలు లేని ప్రాంతాలలో మంత్రి కొలుసు పార్థసారథి సొంత ఖర్చుతో 200 స్తంభాలు ఏర్పాటు చేసే పనులను ప్రారంభించారు.
Eluru: సొంత డబ్బుతో 200 విద్యుత్తు స్తంభాలు!
Eluru: నూజివీడు పట్టణంలో గత 20 సంవత్సరాలుగా కొన్ని వార్డులు,కొన్ని ఏరియాల్లో విద్యుత్తు స్తంభాలు లేక చీకటిలో మగ్గుతున్నాయి.ఎన్నోసార్లు టెండర్లు వేసినా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి.విషయం తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌర సంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తమ స్వంత నగదు వెచ్చించి 200 విద్యుత్తు స్తంభాలు,కండక్టర్లు,ఇతర సామగ్రి కొనుగోలు చేసి బుధవారం పనులు ప్రారంభించారు.
యానాదులు కాలనీ,గాంధీనగర్,గొడుగువారి గూడెం వచ్చే 20 రోజుల్లో పనులు పూర్తిచేసి పట్టణాన్ని కొత్త వెలుగులతో నింపుతామని మంత్రి తెలిపారు.ఎన్నో ఏళ్లుగా చీకటిలో బిక్కుబిక్కు మంటూ గడిపామని,వీధిలైట్లు లేక పాములు బెడద,కుక్కలు బెడద, దొంగలు భయంతో నిద్రలేని రాత్రులు గడిపామని,నేడు మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో చీకట్లు పోయి వెలుగులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి కొలుసు పార్థసారథికి,కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలిపారు.
గత పాలకులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇదిగో చేస్తాం,అదిగో చేస్తాం అంటూ కాలయాపన చేసి చీకట్లో నెట్టేశారని,దూరదృష్టి,మంచి మనసున్న మంత్రి రాకతో పట్టణ రూపురేఖలే మారుతున్నాయని అన్నారు.పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు సీసీ రోడ్లు,డ్రైనేజీలు,పార్కులు, సెంట్రల్ లైటింగు ఇండోర్ స్టేడియం,త్రాగునీటి సదుపాయాలు.20 ఏళ్లుగా లేని విద్యుత్తు స్తంభాలను స్వంత నగదుతో నిర్మిస్తున్న మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని పట్టణ ప్రజలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు,సిబ్బంది,స్థానిక ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.




