Nuzvid: మొక్కలు నాటిన మంత్రి కొలుసు పార్థసారథి

Nuzvid: నూజివీడులో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Oct 2026 7:26 PM IST
Nuzvid
X

Nuzvid: మొక్కలు నాటిన మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు: నూజివీడు పట్టణంలోని న్యూ ఎంప్లాయిస్ కాలనీ ఎన్టీఆర్ పార్కులో శుక్రవారం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాజీవితంలో,ప్రజాసేవలో విజయవంతంగా 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా 'సేవా సంకల్ప్ అభియాన్'లో భాగంగా 'సేవా మేరా యోగ్ దాన్' పేరిట రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ,ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి,ఎంతో అనుభవం ఉన్ననాయకులు ప్రజాసేవలుపట్ల చూపుతున్న నిబద్ధతను,అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయ్యాలని అన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటి,సంరక్షించే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని అన్నారు.

ప్రధానమంత్రి గడిచిన పాతికేళ్లుగా నిరంతరం ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.దేశాభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రజలు భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. "సేవా మేరా యోగ్ దాన్' ద్వారా ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణను ఒక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.​

భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని,నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపి అగ్రికల్చర్ మిషన్ వైస్- చైర్మన్ మరియు నూజివీడు నియోజకవర్గ పరిశీలకులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి,మున్సిపాలిటీ కమీషనరు కె.పీరయ్య,పట్టణ ప్రముఖులు,ప్రజాప్రతినిధులు,కూటమి నాయకులు,న్యూ ఎంప్లాయిస్ కాలనీ సభ్యులు,మున్సిపల్ శాఖ ఉద్యోగులు,స్థానిక ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్