Nuzvid: పార్కు అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి
Nuzvid: నూజివీడు గాంధీనగరులో పార్కు అభివృద్ధి పనులను మంత్రి కొలుసు పార్థసారథి ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్వరలోనే పార్కును అందుబాటులోకి తెస్తామన్నారు.
Nuzvid: పార్కు అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి
నూజివీడు: నూజివీడు పట్టణం గాంధీనగరులో సుమారు 5 ఎకరాలు 30 సెంట్ల కామన్ సైటు గతంలో పార్కుకోసం కేటాయించగా ఇప్పటివరకూ ఎలాంటి అభివృద్ధి లేక నిరుపయోగంగా ఉన్న విషయం తెలుసుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి,మూడురోజులు క్రితం పార్కు అభివృద్ధి పనులు వేగవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
శుక్రవారం అభివృద్ధి పనులను మంత్రి కొలుసు పార్థసారథి ఆకస్మికంగా తనిఖీలు చేశారు.ప్రాంగణం మొత్తం పరిశీలించి దాని ఆవశ్యకత,చరిత్రను అధికారులను అడిగి క్షుణ్ణంగా తెలుసుకున్నారు.స్థానిక ప్రజలు, పట్టణ ప్రజలు చుట్టుపక్కలు ప్రాంతాల్లో దగ్గరలో ఎలాంటి పార్కులేదని,పార్కు అభివృద్ధి చేస్తే అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని,పట్టణ ప్రజలకు ఆహ్లాదంగా ఉంటుందని త్వరలో అభివృద్ధి చెయ్యాలని మంత్రిని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పార్కు అభివృద్ధికి తగినంత మూలధనం,మౌలిక సదుపాయాలు సాధ్యమైనంత త్వరలో సమకూర్చి అభివృద్ధి చేసే బాధ్యత నాదని,అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి అందజేస్తానని స్పష్టం చేశారు.పార్కుకు ఉన్న అడ్డంకులను త్వరలో తొలగించి నిధులు అందిన వెంటనే అభివృద్ధి వేగవంతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం,మెరుగైన మౌళిక వసతులు కల్పించడమే లక్ష్యంగా మున్సిపల్ పార్కు పట్టణానికి వన్నెతెచ్చే విధంగా అభివృద్ధి చెయ్యాలని అన్నారు.పార్కులోని వాకింగు ట్రాక్, పిల్లలు ఆట స్థలాలు,పచ్చదనం, లైటింగు,తాగునీరు,చుట్టూ అందమైన పెన్సింగు, తదితర సౌకర్యాలు పురోగతిపై మున్సిపల్ అధికారులకు కీలక సూచనలు చేశారు.
పార్కు పనుల్లో ఎక్కడా అలసత్వం వహించకుండా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.నిర్మాణపనుల్లో రాజీ పడకుండా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపి అగ్రికల్చర్ మిషన్ వైస్- చైర్మన్ మరియు నూజివీడు నియోజకవర్గ పరిశీలకులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి,మున్సిపాలిటీ కమీషనరు కె.పీరయ్య,పట్టణ ప్రముఖులు,ప్రజాప్రతినిధులు,కూటమి నాయకులు,స్థానిక ప్రజలు,మున్సిపల్ శాఖ ఉద్యోగులు,స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




