Nuzvid: క్లాప్ మిత్రాలను ఘనంగా సన్మానించిన మంత్రి కొలుసు పార్థసారథి

Nuzvid: నూజివీడు మండలం పల్లెర్లమూడిలో మంత్రి కొలుసు పార్థసారథి క్లాప్ మిత్రాలను ఘనంగా సన్మానించి, సమాజంలో వారి సేవల ప్రాముఖ్యతను కొనియాడారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Oct 2026 8:06 PM IST
Nuzvid
X

Nuzvid: క్లాప్ మిత్రాలను ఘనంగా సన్మానించిన మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు: నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో గురువారం "పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ" కార్యక్రమం మరియు పీ-4 అవగాహన సదస్సు అనంతరం గ్రామంలో క్లాప్ మిత్రాలను రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.సమాజ ఆరోగ్య రక్షణలో క్లాప్ మిత్రులు అందిస్తున్న సేవలు ఎనలేనివని, పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటింటికీ వెళ్ళి వ్యర్థాలను సేకరిస్తూ,పరిసరాలను పరిశుభ్రతకు పాటు పడుతున్న వీరిసేవలు అభినందనీయమన్నారు.ప్రజలు కూడా బాధ్యతగా తడి,పొడి చెత్తను వేరుచేసి అందించి సహకరించాలని కోరారు.​వారికి అవసరమైన రక్షణ పరికరాలు,సంక్షేమ ఫలాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

సమాజంలో ప్రతి ఒక్కరూ వీరి సేవలను గుర్తించి గౌరవించాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న,నియోజకవర్గం ప్రత్యేక అధికారి రవికుమార్,డివిజనల్ పంచాయతీ అధికారి యం.పి.యన్.సుందరి,తహశీల్దారు షేక్ సంసిద్దీన్,యంపిడివో పి.సాంబశివరావు,స్థానిక నాయకులు,కూటమి నాయకులు,స్థానిక ప్రజలు,క్లాప్ మిత్రాలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్