Nuzvid: ఆరు అడుగుల లోతులో బయటపడ్డ పురాతన శివలింగం.. భక్తుల తాకిడి

Nuzvid: నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం టి.గుడిపాడు, పోలవరం గ్రామాల మధ్య బాలుడి సూచనతో తవ్వకాలు జరపగా 6 అడుగుల లోతులో శివలింగం బయటపడింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 3:11 PM IST
Nuzvid
X

Nuzvid: ఆరు అడుగుల లోతులో బయటపడ్డ పురాతన శివలింగం.. భక్తుల తాకిడి

నూజివీడు: నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం టి.గుడిపాడు,పోలవరం గ్రామాల మధ్య ఆరు అడుగుల లోతులో శివలింగం బయటపడింది.

బాలుడికి ఆంజనేయస్వామి ఆవహించారనే ప్రచారంతో జరిగిన తవ్వకాల్లో ఈ విగ్రహం వెలుగు చూసింది.నవంబర్ 5,6 తేదీల్లో ఓ బాలుడు తనకు ఆంజనేయస్వామి ఆవహించారని చెబుతూ,భూగర్భంలో శివలింగం ఉన్న ప్రదేశాన్ని చూపించాడు.

గ్రామస్తులు పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించి వాగు సమీపంలో తవ్వకాలు చేపట్టగా ఆరు అడుగుల లోతులో శివలింగం లభించింది.

బయటపడిన శివలింగాన్ని మేళతాళాలతో గ్రామంలోని అమ్మవారి ఆలయానికి తరలించగా,చుట్టుపక్కల గ్రామాల భక్తులు దర్శనానికి భారీగా తరలివస్తున్నారు.తన కలలోనూ శివుడు కనిపించి ఆలయ నిర్మాణం జరుగుతున్నట్లు సంకేతాలు ఇచ్చారని గ్రామ పెద్ద ఈ సందర్భంగా తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్