Kukunoor: అమరవరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో!

Kukunoor: కుక్కునూరు మండలం అమరవరం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎంపీడీవో నాగరాజు పరిశీలించి, నాణ్యతపై అధికారులకు తగు సూచనలు చేశారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 30 Sept 2026 5:52 PM IST
Kukunoor
X

Kukunoor: అమరవరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో!

Kukunoor: కుక్కునూరు మండల పరిధిలోని అమరవరం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును ఎంపీడీవో నాగరాజు పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం నాణ్యత, రుచి, మెనూ అమలును స్వయంగా పరిశీలించారు.

ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజూ వేడివేడిగా, రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఈరోజు మెనూ ప్రకారం తయారు చేసిన కూరలు రుచికరంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే నాణ్యతను ప్రతిరోజూ కొనసాగించాలని నిర్వాహకులకు సూచించారు.

“విద్యార్థులకు మంచి భోజనం అందితేనే వారు ఆరోగ్యంగా ఉండి చదువుపై ఆసక్తి చూపుతారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు” అని ఎంపీడీవో నాగరాజు అన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో నరసింహారావు, పంచాయతీ కార్యదర్శి మహేష్, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR