Eluru: లింగపాలెం మండలంలో రూ.2.53 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన!
Eluru: ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెంలో రూ.2.53 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే.
Eluru: లింగపాలెం మండలంలో రూ.2.53 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన!
Eluru: లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెం గ్రామంలో రూ.2 కోట్ల 53 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్.
ఈ సందర్భంగా గ్రామంలో రూ.2.53 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారుల నిర్మాణం కీలక పాత్ర పోషిస్తుందని, నూతన రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా నిత్యం ప్రయాణించే ప్రజలు, రైతులు, విద్యార్థులు, వాహనదారులకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




