Chintalapudi: చింతలపూడిలో జల జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే!

Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం మాలపల్లిలో రూ.44 లక్షలతో జల జీవన్ మిషన్ పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన చేశారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI
Published on: 5 Oct 2026 6:19 PM IST
Chintalapudi
X

Chintalapudi: చింతలపూడిలో జల జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే!

Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం మాలపల్లి గ్రామంలో జల జీవన్ మిషన్ 2.0 పథకం ద్వారా రూ.44. లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పనులకు శంకుస్థాపన చేసేరు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.మాలపల్లి గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మంజూరైన నిధులతో పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రజలకు ప్రతి రోజు ఏమి చేయాలో తపన పడుతున్నారు.చింతలపూడి నగర పంచాయతీలో 58 కొట్లులతో

అమృత 2.o జరుగుతుంది. సూపర్ సిక్స్ పథకాలు అమలు జరుగుతున్నాయి. డిప్యూటీ. సీఎం పవన్ కళ్యాణ్ పల్లె పండగ పథకం కింద 26 కొట్లు రూపాయలు ఇవ్వటం జరిగింది.త్వరలో డ్రైనేజీలు కూడా వేయటం జరుగుతుంది. రాజధాని లేకుండా వైసీపీ ప్రభుత్వం,చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చినా తరువాత అమరావతి అభివృద్ధి. జరుగుతుందని అన్నారు.చింతలపూడి ఎత్తిపోతాల పథకo ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని అన్నారు.సీసీ రోడ్లు వేసేము, బీట్ రోడ్లు వేసేమని. తెలిపారు.ప్రగడవరం పంచాయతీ టీడీపీ. పంచాయతీ కైవసం చేసుకోవాలి. మన అభివృద్ధి మనమే చేసుకోవాలని,పిలుపునిచ్చారు,ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ చింతలపూడి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, మండలం అధ్యక్షులు చింత విష్ణు మండలం ఉపాధ్యక్షులు తిరుపతిరావు,కోప్పర్ల నాగరాజు, బేతూ మహాలక్ష్మడు, మానేపల్లి రాజారావు, కొమ్ము తిరుపతిరావు, నల్లగొపు కృష్ణమూర్తి, బుద్దాల నాగు, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI