Nuzvid: పరమశివుని కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలి.
Nuzvid: ఏలూరు జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పవిత్ర కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
Nuzvid: పరమశివుని కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలి.
ఏలూరు: ఏలూరు జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పవిత్ర కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరహర మహాదేవ పరమశివుని అనుగ్రహంతో ప్రతి ఇంటాసుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు,అష్టఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే జ్యోతులు అందరి జీవితాల్లోని అజ్ఞానపు చీకట్లను తొలగించి,జ్ఞాన దీప్తులను,ఆనందాన్ని నింపాలన్నారు. భోళాశంకరుని ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం పాడిపంటలతో వర్ధిల్లాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే మొదటి స్థానంలో నిలవాలని కోరుకున్నారు.




