Eluru: 'అర్నాబ్' తుఫాను సహాయక చర్యలపై మంత్రి పార్థసారథి సమీక్ష!

Eluru: 'అర్నాబ్' తుఫానుపై అధికారులతో మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Oct 2026 5:22 PM IST
Eluru
X

Eluru: 'అర్నాబ్' తుఫాను సహాయక చర్యలపై మంత్రి పార్థసారథి సమీక్ష!

ఏలూరు: 'అర్నాబ్' తుఫాను సహాయక కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా పనిచెయ్యాలి అన్న రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడించేలా క్షేత్రస్థాయిలో అధికారులు కదలాలి అని అన్నారు.

ఏలూరు,నూజివీడు అధికారులతో సోమవారం వర్చువల్ విధానంలో మంత్రి సమీక్షించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే అప్రమత్తం చేయాలి అని భారీ వర్షాలు,ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని,ప్రాణ, ఆస్తి,పంట నష్టాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మూగజీవాల రక్షణతో పాటు వరద నీటిలో మునిగిన పంటలను కాపాడుకునేలా రైతులకు తగిన అవగాహన కల్పించాలని అన్నారు.

వరద నీరు నిలిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా వాగులు,డ్రైన్లలోని చెత్తను వెంటనే తొలగించి నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని,పెనుగాలులకు కూలిన చెట్లను వెంటనే తొలగించాలని,తెగిన విద్యుత్ వైర్లతో ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

తాగునీరు,మెడికల్ క్యాంపులు,విద్యుత్ సరఫరా,రవాణా వ్యవస్థలకు ఆటంకం కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి అని రెవెన్యూ,మెడికల్,పోలీస్,పంచాయతీ,ఆర్ అండ్ బి,విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్