Agiripalli: రూ.2.40 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం!
Agiripalli: నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలంలో రూ.2.40 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
Agiripalli: రూ.2.40 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం!
ఆగిరిపల్లి: పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి,ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు.
మంగళవారం నూజివీడు నియోజకవర్గం లోని ఆగిరిపల్లి మండలంలో రూ. 2.40 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు వారు సంయుక్తంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా అడవినెక్కలంలో రూ.20 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్,తోటపల్లిలో రూ.1.20 కోట్లతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో బరియల్ గ్రౌండ్,రూ.25 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.అలాగే నరసింగపాలెంలో రూ.55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.
మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, నిధుల కొరత లేకుండా నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్-చైర్మన్ మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి,అధికారులు,కూటమి నాయకులు పాల్గొన్నారు.




