Eluru: సత్యసాయిబాబా జయంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పార్థసారథి
Eluru: నూజివీడు క్యాంపు కార్యాలయంలో సత్యసాయిబాబా జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొలుసు పార్థసారథి; సేవా కార్యక్రమాలపై ప్రశంసలు.
Eluru: సత్యసాయిబాబా జయంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పార్థసారథి
ఏలూరు: కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం,ఆధ్యాత్మిక మార్గదర్శి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.సత్యసాయిబాబా జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సోమవారం నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్న నినాదంతో విద్య,వైద్యం,తాగునీటి సరఫరా వంటి సేవా కార్యక్రమాల ద్వారా బాబా సమాజానికి ఎనలేని మార్గదర్శనం చేశారన్నారు.అందరికీ సేవ చేయి అన్న బాబా బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
సత్యసాయి ట్రస్ట్ మరియు సేవా సంస్థలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా ప్రపంచ స్థాయి ఉచిత వైద్యం అందిస్తూ లక్షలాది మందికి పునర్జన్మ నిస్తున్నాయని కొనియాడారు.సాయిబాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ శ్రేణులు,పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.




