Nuzvid: పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధి మంత్రి కొలుసు పార్థసారథి

Nuzvid: ఆగిరిపల్లి మండలంలో రూ.1 కోటి వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయమన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Oct 2026 8:41 PM IST
Nuzvid
X

Nuzvid: పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధి మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు: పట్టణాలకు ధీటుగా గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార,పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.నూజివీడు నియోజకవర్గం లోని ఆగిరిపల్లి మండలంలో రూ. 1 కోటి వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సోమవారం సాయంత్రం ఆయన శంకుస్థాపనలు, భూమి పూజలు నిర్వహించారు.

కృష్ణవరం గ్రామంలో రూ. 80 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్,రోడ్డు,కల్వర్టు పనులకు అలాగే ఆగిరిపల్లి గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న ముదిరాజుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి శిలాఫలకాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు,మహిళలు మంత్రికి బాణాసంచా కాల్చి, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలను అధిగమించేందుకు డ్రైనేజీలు,కల్వర్టుల నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతుందని,ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణాన్ని అందిస్తామని తెలిపారు.నిరుపేద,మధ్యతరగతి వర్గాల సామాజిక కార్యక్రమాలకు కమ్యూనిటీ హాళ్లు దోహదపడతాయన్నారు.

మిగిలిపోయిన పనులను దశలవారీగా పూర్తి చేస్తామని,అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో,నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు,కూటమి నాయకులు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్