Nuzividu: పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండ: మంత్రి కొలుసు పార్థసారధి!

Nuzividu: ఏలూరు జిల్లా నూజివీడులో 217 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Oct 2026 10:52 PM IST
Nuzividu
X

Nuzividu: పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండ: మంత్రి కొలుసు పార్థసారధి!

నూజివీడు: ఆపద సమయాల్లో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నూజివీడులోని తన క్యాంపు కార్యాలయంలో 217 మంది లబ్ధిదారులకు రూ. 1,05,40,280 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులను, యోగక్షేమాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 2,307 మంది లబ్ధిదారులకు రూ.18.61 కోట్ల రూపాయల సహాయాన్ని అందించాం అని కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో 907 సంజీవిని వాహనాలు ప్రతి గ్రామంలో తిరిగి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆధార్ నంబర్ ఆధారంగా ఈ రిపోర్టులు డిజిటలైజ్ అవుతాయి కాబట్టి,ఏ ఆసుపత్రికి వెళ్లినా పదే పదే పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు అని అన్నారురూ.

ఇన్సూరెన్స్ పథకం ద్వారా రూ. 25 లక్షల వరకు,ఆపై ఖర్చయితే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు పొందవచ్చు అని ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు,స్థానిక నాయకులు,లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్