T. Narsapuram: ప్రజల సమస్యలు పరిష్కరించాలి మంత్రి కొలుసు పార్థసారధి
T. Narsapuram: ఏలూరు జిల్లా బొర్రంపాలెంలో మంత్రి కొలుసు పార్థసారధి ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు విని, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.
T. Narsapuram: ప్రజల సమస్యలు పరిష్కరించాలి మంత్రి కొలుసు పార్థసారధి
టి.నర్సాపురం: ప్రజలు ఎదుర్కునే సమస్యలను తెలుసుకుని వాటికి నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు.ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లోని టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం లోని వ్యవసాయ ప్రాధమిక సహకార పరపతి సంఘ భవనంలో సోమవారం ప్రజా దర్బార్ లో ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాల్సిందిగా మంత్రి సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని,ప్రభుత్వ ఆశయానికి అధికారులు స్పందించి ప్రజల నుండి అందిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి,ప్రజలకు సంతృప్తి స్థాయిలో నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమానికి సమాన ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదని,జిల్లాలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయడంతోపాటు,అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్లు,డ్రైనేజి,విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేస్తే, అదనపు నిధులు మంజూరుకు ప్రభుత్వాన్ని కోరేందుకు అవకాశం ఉంటున్నదన్నారు.ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో రోడ్లు,త్రాగునీరు,విద్యుత్, వంటి మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా టి. నర్సాపురం మండల పరిధిలో విద్యుత్ లో-ఓల్టేజ్ సమస్య అధికంగా ఉందని, దీని కారణంగా తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు మంత్రి కోరారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి ఫోన్ ద్వారా తెలియజేసి సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.టి.నర్సాపురం మండలం బొర్రంపాలెంలో ఎర్రకాల్వ పరిధిలోని మత్స్యకారులను మత్స్యకార సొసైటీ లో సభ్యులు చేర్చాలని మత్స్యకారులు మంత్రిని కోరగా ,ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలలో అర్హులైన కొందరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అందలేదని,ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా ప్యాకేజి అందించాలని నిర్వాసిత కుటుంబాలు మంత్రి దృష్టికి తమ సమస్యను విన్నవించుకున్నారు.ఈ విషయంను పరిశీలించి,నిబంధనల మేరకు అర్హులైన ప్రతీ కుటుంబానికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ని మంత్రి ఆదేశించారు.రైతులకు అవసరమైన ఎరువులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని, ఎరువులకు ఎటువంటి సమస్య లేదన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నప్పటికీ కొన్ని పత్రికలు ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా వార్తలను ప్రచురిస్తున్నాయని,వాటిని తిప్పికొట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా బొర్రంపాలెం గ్రామంలో బైక్ మంత్రి పార్థసారధి ప్రజల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం బొర్రంపాలెం సెంటర్ లో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పార్థసారధి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్,ఐటిడిఏ పిఓ రాములు నాయక్,జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ,తహసీల్దార్ టి.నాగరాజు,వ్యవసాయ,అనుబంధ శాఖల అధికారులు,ప్రభృతులు పాల్గొన్నారు.




