Eluru: ఖరీఫ్‌లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం!
Eluru: ఏలూరులో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్‌లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమని వెల్లడించారు.
Eluru: ఖరీఫ్‌లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం!
Eluru: రానున్న ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాలు శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో గురువారం జిల్లా సమీక్ష సమావేశం అనంతరం పాత్రికేయులతో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్న ఖరీఫ్ సీజన్ లో ఎటువంటి ఇబ్బందులు,ఫిర్యాదులు లేకుండా రైతుల నుండి ధాన్యం సేకరణకు రైతు సేవా కేంద్రాల స్థాయిలో సంసిద్దతకు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రైతులకు నాణ్యమైన గొనె సంచులు అందిస్తామని,తేమ శాతం,రవాణాలో ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.ధాన్యం సేకరించిన 24 గంటలలోగా రైతుల ఖాతాలో సొమ్ము జమ చేయడంతోపాటు,దేశంలో ఎక్కడా లేనివిధంగా రవాణా చార్జీలను కూడా అదేరోజు రైతులకు జమ చేస్తామన్నారు.
రాష్ట్రంలో రూ. 48/-లకే కర్నూలు సోనా బియ్యంను ప్రజలకు అందిస్తామని,ప్రత్యేక కౌంటర్ల ద్వారా 1.60 లక్షల మెట్రిక్ టన్నులు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనాదక్షతతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకువచ్చారని,వీటి ద్వారా రాష్ట్రంలోని 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
విశాఖపట్నం నిర్వహించిన సిఐఐ సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒప్పందాలు కుదిరాయన్నారు.వ్యవసాయ,అనుబంధ రంగాలు,ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలలో పరిశ్రమల స్థాపనకు ఎంఓయు లు కుదిరాయన్నారు.రాష్ట్రంలో 3 ఎకనామిక్ జోన్లు ఏర్పాటుచేసి,రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి తీసుకువెళ్తున్నారని రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి గత ప్రభుత్వం వ్యతిరేక చర్యలు తీసుకున్నదన్నారు.
గత ప్రభుత్వ చర్యలతో అనంతపురంలో కియా పరిశ్రమకు అనుబంధ పరిశ్రమల స్థాపనలో గత ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించిందని, 9500 కోట్ల రూపాయలతో అమరరాజా కంపెనీ కూడా తెలంగాణా కు తరలిపోయిందని ,7500 కోట్ల రూపాయలతో రేణిగుంటలో పరిశ్రమను నెలకొల్పేందుకు ప్రయత్నించినా రిలియన్స్ కంపెనీ కూడా వేరే రాష్ట్రానికి వెళ్లిపోయిందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ,శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్,జయమంగళ వెంకటరమణ,శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి),చింతమనేని ప్రభాకర్,సొంగా రోషన్ కుమార్,పత్సమట్ల ధర్మరాజు,డా.కామినేని శ్రీనివాస్,ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు,వడ్డీలు కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




