Kukkunoor: కుక్కునూరులో కూటమి అభ్యర్థుల ప్రచార జోరు.. జనసందోహం నడుమ భారీ ర్యాలీ
Kukkunoor: కుక్కునూరు మేజర్ పంచాయతీలో టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు నేతృత్వంలో కూటమి అభ్యర్థుల తరఫున భారీ ర్యాలీ, ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Kukkunoor: కుక్కునూరులో కూటమి అభ్యర్థుల ప్రచార జోరు.. జనసందోహం నడుమ భారీ ర్యాలీ
కుక్కునూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కుకునూరు మేజర్ పంచాయతీలో కూటమి అభ్యర్థుల తరఫున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుకునూరు జడ్పీటీసీ అభ్యర్థి బొంతు కోమలదేవి, ఎంపీటీసీ-1 అభ్యర్థి పిచ్చుక రాజు, ఎంపీటీసీ-2 అభ్యర్థి ఆసి శ్రీలతల విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు (నాగు) నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.
జనసందోహం నడుమ సాగిన ప్రచారంలో కూటమి శ్రేణులు గ్రామంలోని వివిధ వీధుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి అభ్యర్థులను పరిచయం చేశారు. ఓటర్లను కలిసి తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో కుకునూరు మేజర్ పంచాయతీలో ఎన్నికల సందడి నెలకొంది.
ఈ సందర్భంగా ములిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థుల గెలుపుతో గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రచారాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు.. నాగన్నకు అభినందనలు వెల్లువ!
ప్రచార కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ములిశెట్టి నాగేశ్వరరావు ప్రత్యేకంగా భోజన వసతులు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లపై ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




