Velairpadu: ఫారం-9 ఇచ్చాక అభ్యర్థుల తొలగింపుపై మాస్ లైన్ పార్టీ ఫైర్

Velairpadu: ఫారం-9 జారీ చేసిన తర్వాత అభ్యర్థులను తొలగించే అధికారం ఆర్వోకు లేదని, వేలేరుపాడులో జరిగిన ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని మాస్ లైన్ పార్టీ హెచ్చరించింది.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 31 Oct 2026 10:28 PM IST
Velairpadu
X

Velairpadu: ఫారం-9 ఇచ్చాక అభ్యర్థుల తొలగింపుపై మాస్ లైన్ పార్టీ ఫైర్

వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పంచాయతీరాజ్ ఎన్నికల ప్రక్రియపై వివాదం నెలకొంది. ఫారం-9 జారీ చేసిన అనంతరం అభ్యర్థులను తొలగించే అధికారం రిటర్నింగ్ అధికారికి లేదని మాస్ లైన్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కొందరు అధికారులు వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తమ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని, వారు తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం ఉందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలు, అవకాశవాద రాజకీయ కుట్రలను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు గడ్డాల ముత్యాలరావు, మేడేపల్లి మాజీ సర్పంచ్ కట్టం రాంబాబు, ధర్మయ్య, పోతయ్యతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కుంజ శ్రీరాములు, మహేశ్వరరావు, రామకృష్ణ, చక్రి, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR