Nuzvid: మండవ వెంకట్రామయ్య జీవితం మార్గదర్శకం: వెంకయ్య నాయుడు
Nuzvid: నూజివీడు మండలం తుక్కులూరులో దివంగత మండవ వెంకట్రామయ్య జీవిత చరిత్ర ‘భువి నుంచి భువనం వరకు’ పుస్తకాన్ని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
Nuzvid: మండవ వెంకట్రామయ్య జీవితం మార్గదర్శకం: వెంకయ్య నాయుడు
Nuzvid: మహోన్నత వ్యక్తిత్వం,నిష్కళంక జీవన విధానానికి నిలువెత్తు రూపమైన మండవ వెంకట్రామయ్య జీవిత గమనం భావితరాలకు గొప్ప మార్గదర్శకమని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
నూజివీడు మండలం తుక్కులూరులో జరిగిన స్మారక కార్యక్రమంలో కీ.శే.మండవ వెంకట్రామయ్య జీవిత విశేషాలతో రూపొందించిన ‘భువి నుంచి భువనం వరకు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) నుంచి ఎం.ఎస్సీ.పట్టా పొందిన వెంకట్రామయ్య, స్వగ్రామంలో విత్తన పరిశ్రమను స్థాపించి రైతు ప్రయోజనమే పరమావధిగా జీవించారని కొనియాడారు.క్రమశిక్షణ,సమయపాలన,నిరాడంబరత ఆయన సహజ లక్షణాలని,నేటి యువత పెద్దలు బతికున్నప్పుడే వారితో సమయం గడుపుతూ కుటుంబ మూలాలను,విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముందు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయన ప్రజాస్వామ్య పోరాటాన్ని స్మరిస్తూ వెంకయ్య నాయుడు ఘన నివాళులు అర్పించారు.ఈ గ్రంథాన్ని చక్కగా రూపకల్పన చేసిన రచయిత డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణ రావును,వెంకట్రామయ్య కుమారుడు శ్రీ మండవ ప్రభాకరరావును ఆయన అభినందించారు.
టిటిడి అన్నమయ్య ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడసాని మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు,దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్,ప్రముఖులు కరణం బలరామకృష్ణ మూర్తి,లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డా.జయప్రకాశ్ నారాయణ,సీవీసీ మాజీ చైర్మన్ కేవీ చౌదరి,బొల్లినేని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.




