Chintoor: చింతూరులో కుయుగూరు గ్రామస్తుల వినూత్న జలదీక్ష
Chintoor: గోదావరి, శబరి వరదలతో జలదిగ్బంధంలో చిక్కుకున్న చింతూరు మండలం కుయుగూరు ప్రజలు రహదారిపై మోకాళ్లలోతు నీటిలో నిలబడి వినూత్న జలదీక్ష చేపట్టారు.
Chintoor: చింతూరులో కుయుగూరు గ్రామస్తుల వినూత్న జలదీక్ష
చింతూరు: గోదావరి శబరి వరదల వలన తాము పడే కష్టాలు బాధలు వర్ణనాతీతం అని కుయుగూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.వరదల నుండి తమని రక్షించాలంటూ జలమయమైన కుయుగురు రహదారి పై గ్రామస్తులు శుక్రవారం జలదీక్ష చేశారు.
చిన్నపాటి వరద సంభవిస్తే తమ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంటుందని దీంతో తాము నానా కష్టాలు పడాల్సి వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతి ఏడాది శబరి వరద వలన తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఏ ప్రభుత్వం, అధికారులు స్పందించడం లేదని వాపోయారు.
చిన్నపాటి వరదకే తమ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంటుందని కానీ పోలవరం ముంపులో ఈ గ్రామాన్ని 45 కాంటూరులో కలపడం బాధాకరమని ఆవేదన చెందారు.రహదారి జలమయం అయితే ఈ సమయంలో గ్రామస్తులు ఏదైనా అనారోగ్యానికి గురైతే ఆదుకునే నాధుడు లేరని తమకు దేవుడే దిక్కు అని వాపోతున్నారు.
కుయుగురు గ్రామాన్ని 41 కాంటూరులో కలిపి తక్షణమే తమకు పరిహారం, పునరావాసం కల్పించి ఈ వరద కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు.




