Kukunoor: కుక్కునూరులో రేపు వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం
Kukunoor: కుక్కునూరులో అక్టోబర్ 13న వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సమక్షంలో స్థానిక ఎన్నికల కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
Kukunoor: కుక్కునూరులో రేపు వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం
కుక్కునూరు: కుక్కునూరులో రేపు (అక్టోబర్ 13) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు తాండ్ర రాజేష్ తెలిపారు. ఉదయం 10 గంటలకు చర్చి హాస్టల్ ఆవరణలో జరిగే ఈ సమావేశానికి పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మండల పరిధిలోని ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవడంతో పాటు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈ సమావేశం వేదికగా నిలవనుందని తాండ్ర రాజేష్ పేర్కొన్నారు.
మండలవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.




