Kukunoor: కుక్కునూరు సర్పంచ్ స్థానానికి త్రిముఖ పోటీ.. గుర్తుల ఖరారు

Kukunoor: కుక్కునూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి త్రిముఖ పోటీ; ములిశెట్టి నాగేశ్వరరావు, దారా సంజీవరావు, బుయ్యన్న నాంచారమ్మలకు గుర్తులు కేటాయింపు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 21 Nov 2026 9:34 PM IST
Kukunoor
X

Kukunoor: కుక్కునూరు సర్పంచ్ స్థానానికి త్రిముఖ పోటీ.. గుర్తుల ఖరారు

కుక్కునూరు: మండల కేంద్రంలోని కుక్కునూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. సర్పంచ్ స్థానం ఏకగ్రీవం అవుతుందని భావించిన తరుణంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికల సమీకరణాలు మారిపోయాయి.

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడంతో సర్పంచ్ స్థానానికి యథావిధిగా ఎన్నిక జరగనుంది. దీంతో కుక్కునూరు పంచాయతీలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.

సర్పంచ్ బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులను కేటాయించారు. టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావుకు ఉంగరం గుర్తు, స్వతంత్ర అభ్యర్థి దారా సంజీవరావుకు మంచం గుర్తు, మరో స్వతంత్ర అభ్యర్థి బుయ్యన్న నాంచారమ్మకు కత్తెర గుర్తు కేటాయించారు.

ఏకగ్రీవం అవుతుందని భావించిన సర్పంచ్ స్థానం చివరకు ఎన్నికల బరిగా మారడంతో కుక్కునూరులో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ముగ్గురు అభ్యర్థుల మధ్య జరగనున్న పోటీలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR