Kukunoor: కుక్కునూరు, అమరవరంలో టీడీపీ ఎంపీటీసీల విజయోత్సవ ర్యాలీలు
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు, అమరవరం–తొండిపాక టీడీపీ ఎంపీటీసీ విజేతలు పిచ్చుక రాజు, తోటకూర రజితల ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీలు.
Kukunoor: కుక్కునూరు, అమరవరంలో టీడీపీ ఎంపీటీసీల విజయోత్సవ ర్యాలీలు
కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్నికల్లో విజయం సాధించిన కుక్కునూరు–1 ఎంపీటీసీ పిచ్చుక రాజు, టీడీపీ మండల కన్వీనర్ ములిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
అదేవిధంగా అమరవరం–తొండిపాక ఎంపీటీసీగా గెలుపొందిన తోటకూర రజిత, అమరవరం టీడీపీ గ్రామ కన్వీనర్ గొల్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.
ఈ ర్యాలీల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూ బాణసంచా, నినాదాలతో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. దీంతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.




