Kukunoor: టీడీపీ కార్యకర్త భద్రయ్య మృతి.. పాడె మోసిన నాగేశ్వరరావు

Kukunoor: కుక్కునూరు మండల టీడీపీ సీనియర్ కార్యకర్త ఊకె భద్రయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు పాడె మోసి నివాళులర్పించారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 19 Oct 2026 4:49 PM IST
Kukunoor
X

Kukunoor: టీడీపీ కార్యకర్త భద్రయ్య మృతి.. పాడె మోసిన నాగేశ్వరరావు

కుక్కునూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మృతితో కుక్కునూరు మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుక్కునూరు పంచాయతీ పరిధిలోని కోర్లకుంట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త ఊకె. భద్రయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మండల టీడీపీ అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు (నాగు) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వేలేరుపాడు మండలం బండ్లబోరు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు తక్షణమే స్పందించారు. పోలీసు శాఖకు సమాచారం అందించడంతో పాటు మృతుడి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.

అనంతరం భద్రయ్య భౌతికకాయాన్ని స్వగ్రామమైన కోర్లకుంటకు తీసుకురాగా, నాగేశ్వరరావు పూలమాల వేసి, తెలుగుదేశం పార్టీ జెండాను కప్పి ఘనంగా నివాళులర్పించారు. అంత్యక్రియల్లో స్వయంగా పాడె మోసి, చివరి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన భద్రయ్య మరణం తెలుగుదేశం పార్టీ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. కష్టకాలంలో భద్రయ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చుంచు సత్యనారాయణ, సీనియర్ నాయకులు పిచ్చుక రాజు, రమణరాజు, పులి శ్రీను, సరిహద్దు సత్యనారాయణ, నరేంద్ర రాజుతో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొని భద్రయ్యకు ఘన నివాళులర్పించారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR